Saturday, April 20, 2024

ఏపీకి వ‌ర్ష సూచ‌న‌… రానున్న మూడు రోజుల్లో వానలే వానలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయ‌ని అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ప్రధానంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement