Thursday, April 25, 2024

తౌక్టే అలర్ట్: ఏపీ రైతుల్లో టెన్షన్

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలోలో అనేక చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆకాల వర్షంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement