Friday, March 29, 2024

Rain : రానున్న 24 గంటల్లో ఏపీకి భారీ వర్షాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో రానున్న‌ 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖప‌ట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాజోలు మండలం తాటిపాకలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఏలూరు జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం పడింది. నెల్లూరు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇదే కాకుండా రానున్న 24గంట‌ల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement