Wednesday, March 29, 2023

పట్టాలు తప్పిన రైల్వే లగేజ్ వ్యాన్…

రేణిగుంట (ప్రభ న్యూస్): రేణిగుంట రైల్వే సౌత్ క్యాబిన్​ వద్ద రైల్వే లగేజ్ వ్యాన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. చెన్నై నుండి రేణిగుంట రైల్వే స్టేషన్ కు వస్తున్న లగేజ్ వ్యాన్ రైలు రేణిగుంట సౌత్ క్యాబిన్ వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది.

- Advertisement -
   

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంతో ముంబై, చెన్నై, తిరుపతికి వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement