Saturday, July 24, 2021

ఏపీలో వారికి నో వ్యాక్సిన్.. సీఎం జగన్ కు రఘురామ లేఖ

ఏపీ సీఎం జగన్ కి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. దేశంలో కరోనా రెండో వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించిందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకూ ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందచేయడం ప్రారంభం కాలేదన్నారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే యవతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారని తెలిపారు. రాష్ట్రానికి అప్పులిచ్చేవారు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదన్నారు. కనీసం మంచి వైద్యులైనా ఇక్కడ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీ‌హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా తగిన అనుభవంలేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా పక్క రాష్ట్రాల వైద్యులను కాకుండా ఏపీ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని రఘురామ లేఖలో సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News