Saturday, June 19, 2021

ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందో జగన్ సమాధానం చెప్పాలి: ఎంపి రామ్మోహన్ నాయుడు

ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందో సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్ ని నిలదీశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని మోసగించారని అన్నారు. హోదా వస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు రామ్మోహన్ రెడ్డి. హోదాపై మోసగించిన జగన్ రెడ్డిని యువత నిలదీయాలన్నారు. 28 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నిలదీయడం లేదని దుయ్యబట్టారు. కేసుల కోసం లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో జగన్ రెడ్డి విఫలవిఫలమయ్యరని ఫైర్ అయ్యారు. అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయంతో కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని విమర్శించారు ఎంపి రామ్మోహన్ నాయుడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News