Saturday, December 7, 2024

పులిచింతల ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్‎లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్ట్‎కు భారీగా వరద రావడంతో మూడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03 టీఎంసీల నీరు ఉండగా..జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 26వేల క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 87,521 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను… ప్రస్తుతం  847.60 అడుగులకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement