Friday, April 19, 2024

NV Prasad: బలిసి కొట్టుకుంటున్నది మీరే: ఎమ్మెల్యే ప్రసన్నకు సినీ నిర్మాత కౌంటర్

సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఈ విషయంపై సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. కొవ్వూరులో నల్లపురెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసని ఆయన అన్నారు. నల్లపురెడ్డి కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం ఉందని, అనవసర వ్యాఖ్యలతో కుటుంబ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని అన్నారు.

బలిసి కొట్టుకుంటున్నది సినిమా వాళ్లు కాదని… మీరేనని అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లను అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సినిమా నిర్మాణం ఎంత కష్టతరమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. తన సినిమా నిర్మాణ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను నల్లపురెడ్డి వెనక్కి తీసుకోవాలని ఎన్వీ ప్రసాద్ డిమాండ్ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement