Monday, October 18, 2021

వైసీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కన్నుమూత

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత డాక్టర్ ఎంవీ. రమణా రెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి.. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

గతంలో ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి.. రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. సీమ హక్కుల కోసం పోరాడారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు సంతాపం తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం ఆయన పోరాడారు. కాగా, రమణారెడ్డి కోడలు మల్లెల శ్రీవాణి రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News