Thursday, April 25, 2024

ప్రైవేటు బ‌స్ స‌ర్వీసులు అందుకే స‌క్సెస్ అయ్యాయ‌ట‌..

ప్ర‌భ‌న్యూస్‌, హైదరాబాద్‌: దసరా రద్దీ.. సిటీ నుంచి ఏపీతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ స్లీపర్ స‌ర్వీసుల‌న్నీ ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లో సీట్లు ఖాళీ లేవని చాలామంది ఆందోళ‌న చెందుతున్నారు. ఇట్టాంటి స‌మయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతాల స‌ర్వీసుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం మాత్ర‌మే ఉంది. ఈ భారీ తేడా ఎందుకుంద‌న్న‌దానిపై ఈ మ‌ధ్య‌నే ఆర్టీసీ ఎండీగా చార్జి తీసుకున్న స‌జ్జ‌నార్ దృష్టిపెట్టారు.

ఎందుకీ తేడా..
ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మధ్య ఆక్యుపెన్సీ విష‌యంలో తేడాలుండటానికి ప్రధాన కారణం స్లీపర్‌ సర్వీసులేన‌ని ప‌రిశీల‌న‌లో తేలింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి పడుకుని జ‌ర్నీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీన్ని గ‌మ‌నించిన‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌.. తమ బస్సుల‌ను ఎక్కువ‌గా స్లీపర్‌ సర్వీసులుగా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి దాదాపు వెయ్యికి పైగా స్లీపర్‌ సర్వీసులు న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇట్లాంటి విధానాన్నే ఆర్టీసీలోనూ ప్రవేశ‌పెట్టాల‌ని స‌జ్జ‌నార్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్టీసీలో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆదాయం పెంపుపై ఆయ‌న ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా స్లీపర్‌ సర్వీసుల అంశంపై కూడా ఫోకస్ పెట్టారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణమని గుర్తించారు.

అయితే ద‌స‌రా సీజ‌న్‌లో మోడ‌ల్‌గా ప్ర‌వేశ‌పెట్టి వాటిని నడిపితే ఆదరణ ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ త‌ర్వాత పూర్తిస్థాయిలో అమ‌లు చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే స్లీపర్‌ సర్వీసులు తెచ్చేందుకు ఎండీ సంసిద్ధత వ్యక్తంచేశారు. కాస్త ఆదాయం మెరుగుపడిన తర్వాత బ్యాంకుల నుంచి రుణం తీసుకుని కొన్ని స్లీపర్ స‌ర్వీసులు సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement