Monday, May 29, 2023

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్ర‌ప‌తి కోవింద్

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర‌ప‌తి విశాఖపట్నానికి రానున్నారు. ఆయన నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకుంటున్నారు. 20వ తేదీ రాత్రి నౌకాదళ అతిధి గృహంలో బస చేయనున్నారు. అలాగే ఈ నెల 21వ తేదీన ప్రెసిడెంట్ ప్లీట్ జరగనుంది. అందులో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పాల్గొంటారు. ఆరోజు మొత్తం అక్కడే ఉంటారు. ఈనెల 22 వ తేదీ ఉదయం పదిగంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement