Friday, April 19, 2024

అంగన్ వాడీ సెంటర్ లో సంసిద్ధత కార్యక్రమం.. విధ్య‌పై మహిళలకు అవగాహ‌న..

గోకవరం: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని గోకవరం సెక్టార్ లో గల 8వ సెంటర్ లోని సూపర్వైజర్ పి ఇందిరా రాణి ఆధ్వర్యంలో ఈ.సి.సి.ఈ.డే (ఎర్లీ చైల్డ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్) కార్యక్రమం నిర్వహించారు.

దీనిలో తల్లులకు ప్రీ స్కూల్ యొక్క ప్రాముఖ్యతను రిమోట్ లెర్నింగ్ ద్వారా ఇంటి వద్దకే విద్య, ఆట, పాటలు అనే విష‌యం పై అవ‌గాహ‌న కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఎంపిటిసిలు తోలేటి రమ్య శ్రీ ప్రసాద్, ఉనుకూరి అశీరమ్మ రత్నరాజు, వార్డు మెంబర్ బొడ్డపాటి యశోదమ్మ, వీర చంద్రం, మరియు అంగన్వాడీ వర్కర్ గుమ్మడి బేబీ, ఆయా టి. పద్మావతి లను సూపర్వైజర్ ఇందిరా రాణి స్థానిక ఎంపిటిసిలు, వార్డ్ మెంబర లు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement