Friday, April 19, 2024

అకాల వ‌ర్షం.. అపార న‌ష్టం

అకాల వ‌ర్షం పొద్దుతిరుగుడు పంట రైతుల‌కు అపార న‌ష్టాన్ని మిగిల్చింది. తాడిప‌త్రి మండ‌ల ప‌రిధిలోని వెంకటరెడ్డిపల్లి, ఆవుల తిప్పాయపల్లి,సజ్జలదిన్నె,కావేటి సముద్రం, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లో దాదాపు పదివేల ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగుచేశారు. గురువారం తెల్ల‌వారు జాము నుండి కురుస్తున్న వ‌ర్షాల‌తో పంట పూర్తిగా దెబ్బ‌తింది. ప్ర‌స్తుతం పంట పూత ద‌శ‌లో ఉంది. ఈ ద‌శ‌లో పంట‌కు త‌డి, తేమ త‌గలడంతో విత్త‌నాలు మొలిచేందుకు అవ‌కాశం లేకుండా పోతుంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విత్తన కొనుగోలు మొదలు ఎరువు, పురుగుల మందుల వరకు ఎకరాకు రూ.10 వేల దాకా పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు భారీ వర్షానికి మండల వ్యాప్తంగా రైతులు సాగు చేసిన పొద్దుతిరుగుడు పంట‌కు నష్టం వాటిల్లిందని తెలిసి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కార్యదర్శి రాజా రామి రెడ్డి, నాయకులు శుక్రవారం ఉదయం అవులతిప్పా యపల్లి గ్రామం లో పర్యటించారు. ఊహించని విధంగా వాటిల్లిన ఈ నష్టానికి ఎకరాకు రూ. 25 వేల పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement