Tuesday, April 16, 2024

శివుడు పిలుస్తున్నాడంటూ.. యువకుడి ఆత్మహత్య..

దేవుడు పిలిచాడంటూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. శివయ్య తనను పిలిచాడంటూ యువకుడు శేఖర్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. శివుడు పిలిచాడు.. అందుకు చనిపోతున్నానని లేఖ రాశాడు ఆ యువకుడు. తల్లీ, చెల్లిని బాగా చూసుకోవాలంటూ లేఖలో బంధువులను కోరాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని శేఖర్ రెడ్డి లేఖలో పేర్కొన్నాడు. గతంలోనూ దేవుడి పేరుతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement