Wednesday, June 7, 2023

అక్కను కొట్టి చంపిన తమ్ముళ్లు..

ఆస్తి తగాదాలు వావి వరుసలు కూడా దరి చేయనీయవని నిరూపించారు ఆ సోదరులు. సొంత అక్కను ఆస్తి కోసం దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. ముగ్గురు సోదరులు అక్క, బావపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ గొడవలో అక్క పూర్ణిమ(45) మృతి చెందగా, బావతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజులుగా అక్క, తమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. కాగా తగాదాలు తీవ్ర రూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement