Thursday, April 25, 2024

ప్రజలతో ముఖాముఖి..


ఉలవపాడు : ఉలవపాడు రెవిన్యూ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. మండలంలో వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను తీసుకుని వెంటనే ఆయా శాఖల అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసివి కాలం వచ్చినందున మండలంలోని గ్రామాలలో మంచి నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధకికారులను ఆదేశించారు. చేతిపంపులు రిపేర్లు వస్తే వెంటనే రిపేర్లు చేయాలని, అలాగే బావులు ఎండిపోతే ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాచేయాలని ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. అలాగే గుడ్లూరు మండలంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల కొరకు చేవూరు, పోట్లూరు గ్రామాల్లో స్థలం పరిశీలన జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఉలవపాడు మండలంలో ఉలవపాడుతోపాటు కరేడు, చాకిచర్ల గ్రామాలలో స్థల పరిశీలన జరుగుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి తెలిపారు. ఇంటి పన్నుల వసూలులో మండల పంచాయితీ కార్యదర్శులు బాగా ఇంటి పన్నులు వసూలుచేశారని వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఉలవపాడు మండలంలని రామాయపట్నంలో 98.5 శాతం, చాగొల్లు గ్రామంలో 94.4 శాతం, భీమవరం, వీరేపల్లి గ్రామాల్లో 93 శాతం, పెద్దపట్టపుపాలెం, వీరేపల్లి, ఆత్మకూరు, బద్దిపూడి గ్రామాల్లో 80 శాతం పన్నులు వసూలుచేశారని ఆయన తెలిపారు. కరేడులో 79 శాతం అన్నిటికంటే వెనుకంజలో కృష్ణాపురం గ్రామం 51 శాతం వసూలు చేశారని ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీలు, విద్యుత్‌ శాఖకు బకాయిలు ఉన్నారని అవి కూడా వెంటనే చెల్లించే విధంగా చూడాలని పంచాయితీ కార్యదర్శులకు తెలి పారు. ఇక నుండి రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ పంచాయితీల విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. అర్హులైన వారికి ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే 90 రోజులలోపు వారికి ఇళ్ళపట్టాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జెజెఎం కొరకు ఏప్రిల్‌ 5వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తుల టెండర్లు చేసుకోవచ్చని, అర్హులైన వారు ఈ ఆన్‌లైన్‌ టెండర్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఓఆర్డీ చెంచులక్ష్మి, తహశీల్దారు సంజీవరావు, మండల అధికారులతోపాటు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు ఆర్‌.సింగారెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, పట్టణాధ్యక్షులు కృష్ణారెడ్డి ఆయా గ్రామాల వైసిపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement