Thursday, April 25, 2024

హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ తిరుమలకు పాదయాత్ర

నాగులుప్పలపాడు: సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ శివస్వామి అన్నారు. ముప్పాళ్ళ గ్రామ సర్పంచ్ వైకుంఠ పద్మశ్రీ వీరాంజనేయులు బృందం బుధవారం నుండి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి శ్రీ శ్రీ శివస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో శివ స్వామితో పాటు పాదయాత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శివ స్వామి మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. మనిషి శరీరం, మనసు పవిత్రంగా ఉండాలన్నారు. పేదలకు సహాయపడే గుణాన్ని అలవర్చుకుని సేవ చేయాలన్నారు. ధర్మాచరణ చేయడం వల్ల జీవితం సుఖ శాంతులతో వర్ధిల్లుతుందన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులను పూజించడం అలవర్చుకోవాలన్నారు.

మరోవైపు కరోనా మూడో దశ సమీపిస్తున్న తరుణంలో చిన్నారులకు దాని ప్రభావం లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా వివిధ శైవ క్షేత్రాలలో హోమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వద్దకు వైకుంఠ వీరాంజనేయులు బృందం పాదయాత్రగా వెళ్లడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త పుచ్చకాయల అశోక్ బాబు, మండవ శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement