Saturday, April 20, 2024

గురుకులంలో ఆకస్మిక తనిఖీ ..

కొనకనమిట్ల : మండలంలోని వెలుగొండ ఏపి బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలను ఏపి గురుకుల పాఠశాల జిల్లా సమన్వయ అధికారిణి యం. మంజులా దేవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరుపట్టికలను, వివిధ దస్త్రాలను ఆమె పరిశీలించారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను నూతనంగా ఆమె ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం నిధుల ద్వారా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులు రీజనింగ్‌లో పాల్గొని బంగారు, నగదు బహుమతులను సాధించిన వారిని చిత్రకళలోమంచి ప్రతిభను చూపిన విద్యార్థులను టిపి, సిపిలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రోత్సహించిన పి .డి రాజకుమారి, ఆర్ట్‌ మాస్టర్‌ ప్రసాదరావులను ప్రిన్సిపల్‌ కోటేశ్వరరావును అభినందించారు. పాఠశాల విద్యార్థులు, సిబ్బంది కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని ఆమె సూచించారు. పాఠశాలలో 10, ఇంట ర్‌ విద్యార్థులు రాబోయే పబ్లిక్‌ పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. వంటచెరుకు నిధులు అందలేదంటూ ఆందోళన..వెలుగొండ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు వంట చేసేందుకు సరఫరా చేసిన వంట చెరుకుకు సుమారు రూ.2, 65, 000 నిధులు ఇప్పటికీ మంజూరు చేయలేదని నిర్వాహకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి తనిఖీకి వచ్చిన మంజులా దేవి ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని డిసిఓ సమాధానం ఇచ్చారు. 15 నెలల నుండి విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్స్‌ ఛార్జీలు అందలేదని ప్రిన్సిపల్‌ , అధ్యాపకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని గురుకుల పాఠశాలలతో పాటు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో కాస్మోటిక్స్‌ ఛార్జీల నిధులను త్వరలో జమచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement