Wednesday, April 24, 2024

ప్రకాశం: చీమకుర్తిలో రిక్షాబండ్లతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

చీమకుర్తి పట్టణంలో సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నమన్వయ కమిటీ సభ్యుడు సుబ్బారావు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు నిరసనగా శుక్రవారం రిక్షాబండ్ల నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఉపాధి అవకాశాలు లేక విలవిలలాడిపోతూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా విచిత్రంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్ డీజిల్ పై పెరుగుతున్న రేట్లకు ఎక్కడా కూడా సమాధానం చెప్పకపోగా ప్రతిరోజు రేట్లు పెంచుతూనే ఉండటం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను తారా స్థాయికి తీసుకెళ్లడం దుర్మార్గమని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్లను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పెంచిన ధరల కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడానికి సమాయత్తమైందన్నారు. కావున వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యవసర ధరలను తగ్గించాలని అలానే చెత్తపన్ను నీటిపన్ను ఆస్ధి ఆధారిత పన్నులను రైతులకు ఉరితాళ్ళు కాబోతున్న మీటర్లను ఉపసంహరించుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం యర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇంఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు, మార్కాపురం ఇంఛార్జి షేక్ సైదా,బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జి అంజిబాబు, అద్దంకి ఇంఛార్జి నన్నూరి సీతారామాంజనేయులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవి, కొప్పోలు సుబ్బారావు శ్రీపతి సతీష్, సురేంద్ర, దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, మస్తాన్ వలి, దర్నాసి సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement