Friday, April 19, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి..

కందుకూరు : కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కందుకూరు పట్టణంలో కరోనా వ్యాధి వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకొనుటలో భాగంగా పట్టణ పరిధిలోని 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన దీర్ఘకాలిక వ్యాధులు కలవారు మరియు 60 సంవత్సరాలు పైబడినవారు అందరూ ప్రతి ఒక్కరూ పురపాలక సంఘం నిర్దేశించిన ప్రదేశములలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌.మనోహర్‌ తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన కోటారెడ్డినగర్‌-2, తూర్పువడ్డిపాలెం సచివాలయాల్లో, ఏప్రిల్‌ 2వ తేదీన శ్రీనగర్‌ కాలనీ, శ్రీరామ్‌ కాలనీ సచివాలయాల్లో, 5వ తేదీన బూడిదపాలెం, కోటువారి స్ట్రీట్‌-1 సచివాలయాల్లో, 7వ తేదీన గుర్రంవారిపాలెం, ఎర్రవడ్డిపాలెం సచివాలయాల్లో, 9వ తేదీన కోటువారిస్ట్రీట్‌-2, బిలాల్‌ నగర్‌ సచివాలయాల్లో, 12వ తేదీన ఐ.ఎస్‌.రావ్‌ నగర్‌, జనార్ధనకాలనీ సచివాలయాల్లో, 14వ తేదీన నల్లమల్లవారితోట, సంతోషనగర్‌ సచివాలయాల్లో సదరు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు మున్సిపల్‌ కమీషనర్‌ ఎస్‌.మనోహర్‌ తెలియజేశారు. పై తెలిపిన తేదీలలో తమ తమ ఏరియాలలో గల సచివాలయాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవలసినదిగా తెలియజేశారు. సోమవారం నాడ ఉప్పుచెరువు మరియు 8,9 వార్డులకు సంబంధించిన సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో రెండు సచివాలయాల పరిధిలో సుమారు 400 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకునే వారు ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్లతో తమ వెంట తీసుకొని వ్యాక్సినేషన్‌ సెంటర్లకు వెళ్ళాలని సూచించారు. అలాగే పట్టణ ప్రజలు కూడా తప్పకుండా మస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement