Thursday, April 25, 2024

2వ విడత కోవిడ్‌ వ్యాక్సిన్..

తర్లుపాడు : కరోనా సెకండ్‌వేవ్‌ వేగవంతంగా దూసుకువస్తున్నా ప్రజలు కోవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేసినట్లు వ్యవహరిస్తే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, టీకా వేయించుకోవాలని వైద్యాధికారి కె.వంశీకృష్ణ తెలిపారు. స్థానిక సచివాలయం దగ్గర ఉన్న అంకాలమ్మ ఆలయ ఆవరణలో వైద్యాధికారి డా. కె.వంశీకృష్ణ ఆధ్వర్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నందు 53 మంది అర్హులైన వారికి ఆరోగ్యసిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయడం జరిగిందన్నారు. తహసీల్దార్‌ పులి శైలేంద్రకుమార్‌, ఆర్‌ఐ యం.వి రమణ, రెవిన్యూ సిబ్బంది 2వవిడత వ్యాక్సిన్‌ను వేయించుకోవడం జరిగిందన్నారు. మండలంలోని ప్రతీ సచివాలయంలో యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలందరికి ఇస్తామన్నారు. అర్హులైన 45 – 59 సం.ల మధ్య వయసున్న (బిపి, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు గలవారు మాత్రమే) 60 సం.లు దాటిన ప్రతీ ఒక్కరు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి అర్హులని వంశీకృష్ణ తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌, యంపిడిఓ ఎస్‌.నరసింహులులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డా. టి.చైతన్యసుధ, ఈఓఆర్‌డి అచ్యుతరావు, విఆర్‌ఓ ఇండ్లా శేఖర్‌రెడ్డి, సిహెచ్‌ఓ జె.తులసీప్రసాద్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ టి.సుధాకర్‌, ఎఎన్‌ఎమ్‌ బి.లక్ష్మీదేవి, రాధ, ఆశ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement