Saturday, April 20, 2024

రిజ్వానా చేసిన డిజిట‌ల్ అంబ్రెల్లా సైన్స్ ఫెయిర్ కు..

గిద్దలూరు : రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ సైన్సు వైజ్ఞానిక ప్రదర్శనకు అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లి జెడ్పి హైస్కూల్ విద్యార్థిని తయారు చేసిన డిజిటల్ అంబ్రెల్లా ప్రాజెక్ట్ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్.శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 23వ తేదీ జిల్లా స్థాయిలో 150 ప్రాజెక్టులు ప్రదర్శించగా రాష్ట్రస్థాయి కి15 ప్రాజెక్టులు ఎంపికకాగా అందులో పాపినేనిపల్లి హైస్కూల్ నుండి ఒకటి ఎంపికైంది. పాపినేనిపల్లి జెడ్పి హైస్కూల్ నుండి డిజిటల్ అంబ్రెల్లా, ఫ్రీ ఎనర్జీ టర్బెన్, సోలార్ పవర్ ఇన్సెక్ట్ ట్రాపర్, స్మార్ట్ డస్ట్ బిన్ అనే ప్రయోగాలు జిల్లా స్థాయికి వెళ్లగా అందులో పాఠశాల 10వ తరగతి విద్యార్థిని షేక్.రిజ్వానా తయారు చేసిన డిజిటల్ అంబ్రెల్లా ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. తనలోని ఆలోచనలను ప్రతిభ రూపంలో ప్రాజెక్ట్ తయారు చేసి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. రిజ్వానా తయారు చేసిన ప్రాజెక్టుకు పొలిశెట్టి అల్లూరయ్య గైడ్ టీచర్ గా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థిని షేక్.రిజ్వానాను, గైడ్ టీచర్ అల్లూరయ్య, విద్యార్థి, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎల్.శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు పి.వెంకటేశ్వర్లు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆచారి, షేక్.మెహరున్నిసా, అయ్యప్పశెట్టి, అల్లురయ్య, సుబ్బలక్ష్మి, సూర్యనారాయణ, సిబ్బంది రవీంద్ర,మస్థాన్ వలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement