Thursday, April 25, 2024

రాజ‌కీయ వివాదాల‌లో ఎపి ఇంటిలిజెన్స్

అమరావతి, ఆంధ్రప్ర భ: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి తెరమీదకు ఇంటిలిజెన్స్‌ ప్రస్తావన రావడం ఆసక్తికరంగా మారింది. కోటంరెడ్డి ఆరోపణలను బట్టి చూస్తే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిఘా విభాగానిదే ప్రముఖ పాత్ర అన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం కనుసన్నల్లో అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కంట్రోల్‌లో పని చేసే ఇంటిలిజెన్స్‌ తనకు తానుగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడేంత సాహసం చేయదన్నది కోటంరెడ్డి వ్యాఖ్యల సారాంశం. ఈ నేపధ్యంలో రాష్ట్ర నిఘా వ్యవస్ధ ను మరోసారి రాజకీయ వివాదాలు చుట్టి ముట్టాయంటున్నారు విశ్లేషకులు. పైగా గత ప్రభుత్వాల నుంచీ పరిశీలిస్తే అంతర్గతంగా తెర వెనుక ప్రభుత్వం కోసం పని చేయా ల్సిన అంతరంగిక గూఢాచార వ్యవస్ధ కాల క్రమేణా రాజకీయ యవనికపై చురుకైన పాత్ర పోషిస్తుందనడంలో సందేహమే లేదంటున్నారు. అందుకే ఈ తరహా ఆరోపణల వెల్లువతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ గూఢాచార వ్యవస్ధ మాత్రం రాజకీయ చట్రంలోకి వెళ్ళిపోతుందనే నిపు ణల మాట. అయితే ఈ రకమైన పరిణామం నిఘా వ్యవస్ధ లోపానిది కా దంటున్నారు. కేవలం ఈ వ్యవస్ధకు నేతృత్వం వహించే పెద్దల అత్యుత్సా హమే అనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తపరచడం గమనార్హం. ప్రభుత్వా నికి కళ్ళు, చెవులు అయిన నిఘా విభాగం పాలనాపరమైన అంశాలు, ప్రభుత్వ మనుగడకు సంబంధించిన వ్యవహాాంలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజల్లోనూ, ప్రభుత్వంలోనూ నెలకొన్న తాజా పరిస్ధితులు, పరిణామాలను ప్రభుత్వం దృష్టికి చేరవేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటిలిజెన్స్‌లోనే కీలకమైన పొలిటికల్‌ వింగ్‌ చురుకైన పాత్ర వహించాలి. ప్రభుత్వ అస్ధిరతకు దోహదం చేసే రాజకీయ పరిణామాలను ఒడిసిపట్టి సర్కార్‌ను ఎప్పటికపుడు అప్ర మత్తం చేయాలి. జరుగుతున్న పరిణామాలు, పరిసి ్ధతులను ప్రభుత్వం దృ ష్టిలో ఉంచడం వల్ల ఏం జరుగుతోందనే నివేదిక ఇవ్వడమేగాని ఏం చేయా లన్న నిర్ణయం నిఘా వ్యవస్ధది కాదంటున్నారు నిపుణులు. కాని రాను రాను ప్రభుత్వం ఏం చేయాలో కూడా దిశా నిర్ధేశం చేసే పరిస్ధితుల్లోకి ఇంటి లిజెన్స్‌ వెళ్ళిపోయిందనే ఆరోపణలు రాజకీయ నేతలు చేయడం ఇక్కడ గమనార్హం.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇంటిలిజెన్స్‌ యొక్క ఈ తర హాగా ఉందంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తెలంగాణాలో ఓటుకు నోటు వ్యవహారం తెర మీదకు వ చ్చాక ఏం జరుగుతుందో ముందుగా పసిగట్టలేకపోవడం పూర్తిగా నిఘా వ్యవ స్ధ వైఫల్యంగానే భావించిన చంద్రబాబు సర్కార్‌ నాటి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ అనురాధను తప్పించింది. ఆ స్ధానంలో నియమితులైన ఏబి వెంకటేశ్వరరావు నిఘా బాస్‌గా వ్యవహరించిన తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. విపక్షాలను నిలువరించడంతోపాటు రాజకీయపరమైన నిర్ణయాల్లో జోక్యం పెరిగిందనే విమర్శలు నాటి ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎన్నికల సమయానికి అధికార టీడీపీ అభ్యర్ధులు, ఆ పార్టీ నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా నిఘాధిపతి వ్యవహరించారనే ఆరోపణలు స్వంత పార్టీ నుంచే వెల్లువెత్తాయి. నిఘా వ్యవస్ధకు నేతృత్వం వహించిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒక దశలో పొలిటికల్‌ పవర్‌గా మారారనే ఆరోపణలు చివరికి ఈ స్ధితికి చేర్చాయన్నది ఆ తర్వాత పరిణామాలే స్పష్టం చేశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈక్రమంలో అధికా రంలోకి వచ్చిన జగన్‌ సర్కార్‌లో ఇంటిలిజెన్స్‌ తొలి చీఫ్‌గా కుమార్‌ విశ్వ జిత్‌ ఆతర్వాత మనీష్‌కుమార్‌ సిన్హా కొద్దికాలం పని చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో విజిలెన్స్‌ చీఫ్‌గా ఉన్న కెవి రాజేంద్రనాధ్‌రెడ్డి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో రాజేంద్రనాధ్‌ రెడి ్డ డీజీపీగా నియమితులు కాగా పీ సీతారామాంజనేయులను ఇంటిలిజెన్స్‌ బాస్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆయన ప్రస్తావన రావడంతో నిఘా వ్యవస్ధ రాజకీయ వివాదాల్లోకి లాగబడటం ప్రభుత్వం, రాజకీయ వర్గాల్లో మరోమారు సరికొత్త చర్చకు తావిచ్చింది.

అప్పట్లో ప్రతిపక్షాలు.. ఇప్పుడు స్వంత పార్టీలోనే..
ఏపీలో నిఘా వ్యవస్ధను రాజకీయ వివాదాలు చుట్టుముడుతున్న నేపధ్యంలో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలే ఆరోపణలు చేసేవి. కాని ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ నేపధ్యం ప్రభుత్వంలోని స్వంత పార్టీ ప్రజా ప్రతి నిధులే విమర్శలు, ఆరోపణలకు దిగడం అందుకు ఇంటిలిజెన్స్‌ను కేం ద్రంగా చూపడం ఆసక్తికర చర్చగా మారింది. కోటంరెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి ఆరోపణలతో ఈ అంశం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. దీంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా విచారణ చెయ్యాలని జగన్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోం శాఖ అధికారులు సచివాల యంలో ఈ వ్యవహరంపై సీఎంతో భేటీ కావడం ఉూతమిస్తోంది. కోటం రెడ్డి ఆరోపణలు, బయటకి వచ్చిన ఆడియో టేపుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంటిలిజెన్స్‌ చీఫ్‌తో కూడా సమావేశమైన ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. మరోవైపు ఆధారాలతో సహా ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్న కోటంరెడ్డి వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్న నేపధ్యంలో ధర్డ్‌ పార్టీ ఎంక్వైయిరీకి అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement