Saturday, April 20, 2024

AP: కర్నూలు జిల్లాలో పోలీసుల బదిలీలు.. 223 మంది సిబ్బందికి స్థాన చలనం!

కర్నూలు జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు జరిగాయి. పోలీసుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఖాళీలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లను ఎంపిక చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాల్లో ఒకే చోట 5 సంవత్సరాలు పూర్తి చేస్తుకున్న కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రసాద్ తో కలిసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బదిలీల కౌన్సెలింగ్​ ప్రక్రియ చేపట్టారు.

వివిధ పోలీస్ స్టేషన్ లు, ఆయా విభాగాలలోని ఖాళీల వివరాలను వ్యాస్ ఆడిటోరియం వెలుపల అతికించి సిబ్బంది సులువుగా ఎంపిక చేసుకునే విధంగా కౌన్సెలింగ్​ నిర్వహించి బదిలీ ప్రక్రియను ఈజీగా నిర్వహించారు. ఒక్కొక్కరిని పిలిచి ఇదివరకు పనిచేసిన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్, సొంత మండలం కాకుండా మిగిలిన పోలీస్ స్టేషన్ లలో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రోజెక్టర్ లలో చూపించి వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు.

ఈ సంధర్బంగా ఎస్పీ కౌశల్​ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం పోలీసుల సమస్యలపై పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. సిబ్బంది నేరుగా వచ్చి జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు. ఏమైనా మెడికల్ సంబంధిత సమస్యలుంటే గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ తో కమిటీ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేసుకుని వాటికి పరిష్కారం చూపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement