Thursday, March 28, 2024

ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

పెనుగంచిప్రోలు : మండల పరిధిలోని ముచ్చింతల గ్రామానికి చెందిన శ్రీను ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా కుటుంబ కలహాల వల్ల గ్రామ శివారులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించ‌గా, అదే సమయంలో అటుగా వెళ్తున్న వత్సవాయి మండలం దబ్బాకుపల్లి సర్పంచ్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్ వారి సిబ్బంది కానిస్టేబుల్ ఇ.రాజు, డ్రైవర్ రాజులతో కలిసి సంఘటనా స్థలం వద్దకు వెళ్లి శ్రీనును వారించి ప్రథమ చికిత్స చేయించి అనంతరం కౌన్సిలింగ్ చేసి బంధువులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement