Thursday, April 18, 2024

పోలీసుల స్పందనతో నిలిచిన నలుగురి ప్రాణాలు

అనంతరపురం పోలీసులు స్పందనతో నలుగురి ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళ్లితే.. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిన్న అర్ధరాత్రి స్థానిక శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఓ పాత ఇల్లు గోడలు కూలాయి. దీంతో ఆ ఇంటి పైకప్పు కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఇంట్లో నలుగురు నిద్రిస్తున్నారు. ఆరీఫుల్లా, హసీమా దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ వికలాంగులు. అయితే, ఒక్కసారిగా గోడ కూలి పెద్ద శబ్దం రావడంతో నలుగురూ నివ్వెరపోయి లేచారు. గోడ కూలడంతో ఆ రాళ్లు బయటికి రాకుండా అడ్డంగా పడ్డాయి. పైకప్పు కూలేందుకు సిద్ధంగా వంగిపోయి ఉంది. దీంతో సహాయం కోసం వెంటనే డయల్ – 100కు సమాచారం ఇచ్చారు. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి నేతృత్వంలో సిఐలు కత్తి శ్రీనివాసులు, సాయి ప్రసాద్, ఇతర పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. పెద్ద నిచ్చెన సహాయం ద్వారా ఇంట్లో ఇరుక్కుపోయిన నలుగుర్ని కాపాడి బయటికి తీసుకొచ్చారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement