Thursday, June 1, 2023

నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం

నెల్లూరు జిల్లా చిట్టమూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ అత్యాచారయత్నం చేశాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంటికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం బాలిక తన తండ్రికి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్‌ని అదుపులోకి తీసుకుని ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement