Friday, April 19, 2024

మద్యాం తరలిస్తున్న పోలీసులు.. ఏక్క‌డో తెలుసా..

కర్నూలు(ప్రభ న్యూస్‌): ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలంకు చెందిన పోలీసు వాహనం (సుమో)లో , మద్యం తరలటిస్తుండటంతో సెబ్‌ అధికారులు ప‌ట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద ఆదివారం సెబ్‌ సీఐ మంజుల, ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు వస్తున్న పోలీసు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 70 మద్యం బాటిళ్లు గుర్తించారు. ఏపీ ఎస్పీ కర్నూలు 2వ పటాలనికి చెందిన డాక్టర్‌ బాలకోటయ్య హైదరాబాద్‌ నుంచి పటాలం ఆసుపత్రికి అవసరమైన మందులు(డ్రగ్స్‌) కొనుగోలు చేసి కర్నూలుకు వస్తున్నారు. మార్గమధ్యలో 2 కేసుల్లో 70 బాటిళ్ల మద్యం కొనుగోలు చేసి డ్రగ్స్‌ కింద దాచి తీసుకొసుకెల్తున్నారు.

దీంతో తెలంగాణ ఇంటలిజెన్స్‌ పోలీసులు గుర్తించి ఏపీ ఇంటలిజెన్స్‌ సెబ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి పంచలింగాల దగ్గరున్న అధికారులను అప్రమత్తం చేశారు. తనిఖీల్లో మద్యంతో పాటు- వాహన డ్రైవర్‌ శ్రీనివాసులు, 2 వ పటలపు అసిస్టెంట్‌ కామాండెంట్, శ్రీనివాసరావు దగ్గర డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ శివరాముడు ఇరువురిని అదుపులోకి తీసుకు న్నారు. కర్నూలు సెబ్‌ అధికారులు కానిస్టేబుళ్లు ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే పోలీసు వాహనాన్ని విడుదల చేయాలా లేదా సీజ్‌ చేయాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement