Thursday, March 28, 2024

మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఒడిశాలోని గ్రామాల నుండి అక్రమంగా మద్యాన్ని తరలించే ప్రయత్నాన్ని ఇచ్ఛాపురం రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. సుమండి ( ఒడిశా ) నుండి ఆటోలో తరలిస్తున్న 95 మద్యం సీసాలు, 96 టిన్ బీర్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కవిటి మండలం కపాసుకుద్ది గ్రామానికి చెందిన నిందితుడు నాగుల భరత్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ మద్యం విలువ రూ. 25,770 ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement