Thursday, March 28, 2024

చిన్నారి సింధు శ్రీ కేసులో వీడిన చిక్కుముడి

విశాఖలో సంచలనం సృష్టించిన చిన్నారి సింధు శ్రీ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి తల్లి వరలక్ష్మి ప్రియుడే హంతకుడుగా తేల్చారు. వివాహేతర సంబందానికి అడ్డుగా ఉందనే చిన్నారిని చంపేశాడు. చిన్నారి సింధు శ్రీ తల్లి జగదీష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సింధు శ్రీని తానే పాత మార్చానని పోలీసుల విచారణలో జగదీష్ అంగీకరించాడు. చిన్నారి హత్యకేసులో తల్లి వరలక్ష్మి పాత్ర పైన కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా, పీఎంపాలెం పోలీసులు ఈ కేసును 30 గంటల్లోనే పోలీసులు ఛేదించారు.

జివిఎంసి పరిధి మారికవలస ప్రాంతంలో చిన్నారి సింధు శ్రీ (2) అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన గురువారం (జూన్ 3) వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో ప్రియునితో కలిసి తల్లే హత్య చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఐ ఎ.రవికుమార్‌ కథనం ప్రకారం.. మారికవలస గ్రామానికి చెందిన పీతల వరలక్ష్మి, పెద్దన రమేష్‌ కుమార్‌ భార్యాభర్తలు. వీరికి 2014లో వివాహమైంది. సింధు శ్రీ (2) వీరి కుమార్తె. భార్యాభర్తలు మధ్య విభేదాలు తలెత్తడంతో వేర్వేరుగా ఉంటున్నారు. సింధుశ్రీ తల్లి వద్దే ఉంటోంది. వరలక్ష్మికి బోరవానిపాలేనికి చెందిన బోర జగదీశ్‌రెడ్డితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది.

ఈ క్రమంలోనే వీరు మారికవలస రాజీవ్‌ గహకల్ప కాలనీలో గత నెల 14 నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ నెల 1న సింధుశ్రీకి జ్వరం ఉందని చెప్పి ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతిచెందిందని వైద్యులు చెప్పి తిరిగి పంపించేశారు. కరోనాతో సింధుశ్రీ చనిపోయిందని తల్లి వరలక్ష్మి అందరికీ చెబుతూ వచ్చింది. విషయం తెలిసిన భర్త రమేష్‌ పిఎం.పాలెం పోలీసులను ఆశ్రయించి తన భార్య వరలక్ష్మి, ప్రియుడు జగదీశ్వరరెడ్డి కలిసి పాపను హతమార్చారని ఫిర్యాదు చేశాడు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాప మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. వివాహేతర సంబంధమే చిన్నారి ప్రాణం తీసిందని పోలీసులు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement