Friday, May 20, 2022

ప్రొద్దుటూరు అత్యాచారం కేసు: నలుగు నిందితులు అరెస్ట్!

ఏపీలో సంచలనం రేపిన ప్రొద్దుటూరులో దళిత బాలిక‌పై సామూహిక అత్యాచారం ఘటనపై జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ స్పందించారు. బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో నిన్ననే పోలీసులు కేసు న‌మోదు చేశార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. న‌లుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. పోలీసులు కేసులో జాప్యం చేస్తున్నార‌న్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆరు నెల‌ల క్రితం ఆ బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు, నాలుగు నెల‌ల క్రితం మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారం చేశార‌ని తెలిపారు. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement