Tuesday, April 23, 2024

ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరు

2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం ద్వారా నీరిస్తామని ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా పోలవరం పనులు సాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ 73.45 శాతం, మెయిన్ డ్యామ్ 75.03 శాతం, కనెక్టివిటీ ప్యాకేజ్ 61 .22 శాతం పూర్తయిందని మంత్రి అనిల్ తెలిపారు. లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ 51.73 శాతం, రైట్ కెనాల్ కనెక్టివిటీ 72.81 శాతం, లెఫ్ట్ మెయిన్ కెనాల్  70.09శాతం, రైట్ మెయిన్ కెనాల్  91.69 శాతం పూర్తి అయ్యాయని వివరించారు.

ఈ నెల 15 నుంచి స్పిల్ వే రివర్స్ స్లూయిజ్ ద్వారా.. గోదావరి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోదావరి వరద వచ్చేనాటికి నీటి మళ్లింపు పనులను.. పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యాంను.. నాణ్యతాలోపంతో నిర్మించడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని అనిల్‌ ఆరోపించారు. జూమ్ మీటింగులు, ప్రభుత్వంపై విమర్శలు తప్ప టీడీపీ చేసేదేమీ లేదని విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ నిర్విరామంగా ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిర్వాసితులను సకాలంలో ఆదుకునేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి అనిల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement