Monday, March 18, 2024

పోలవరం అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే పోలవరం.. జగన్

పోలవరం అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే పోలవరమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పోలవరం అంటే వైఎస్సార్‌.. పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే.. అది పూర్తి చేసేది ఆయన కొడుకే.. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదని విమర్శలు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరానికి ఏం చేశారు..? దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం అని ఆగ్రహించారు.

టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టింది.. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం.. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యారు సీఎం జగన్‌. టీడీపీ హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చే పనులు ముందు చేశారన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.800కోట్లు ఆదా అయ్యాయన్నారు. స్పిల్ వే పనులు అసంపూర్తిగా వదిలేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది YSR.. అది పూర్తి చేసే ది ఆయన కొడుకే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement