Thursday, April 25, 2024

మార్చి 13 నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ : కానిస్టేబుల్‌ ప్రిలిమనరీ రాత పరీక్షలో అర్హ త సాధించిన అభ్యర్ధులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు మార్చి 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. ఫిజికల్‌ టెస్టులకు ఎంపికైన మహిళ, పురుష అభ్యర్ధులందరూ ఆయా తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుందని సూచించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

కానిస్టేబుల్‌ స్టేజీ 2 అన్‌లైన్‌ దరఖాస్తు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగియడంతో తదుపరి రిక్రూట్‌మెంట్‌ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. ఫిజికల్‌ ఈవెంట్స్‌కు సంబంధించి కాల్‌ లెటర్లు మార్చి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష ఏప్రిల్‌ చివరి వారంలో నిర్వహించనున్నట్లు- వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement