Thursday, April 25, 2024

చంద్ర‌బాబుపై మంత్రి పేర్ని నాని విమ‌ర్శ‌లు

తెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిన్న సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రజలు బయట ఆర్తనాదాలు చేస్తుంటే… అసెంబ్లీలో సీఎం పొగడ్తలు చెప్పించుకుంటున్నారని మండిపడిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ‌ ఏపీ మంత్రి పేర్ని నాని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబుది ప‌రామ‌ర్శ యాత్రా.. రాజ‌కీయ యాత్రా…అని అన్నారు. ప్ర‌జ‌లు బాధ‌ల్లో ఉంటే… చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు ఈర్ష్య‌, అసూయ‌తో ర‌లిగిపోతున్నార‌ని మంత్రి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement