Thursday, March 28, 2024

Breaking: లోకేష్ పాదయాత్ర కు అనుమతి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో నారా లోకేష్ యాత్ర మొదలవుతుంది. 400 రోజులపాటు 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర సాగనుంది. అయితే ఈ పాదయాత్రకు పోలీసు శాఖ నుంచి అనుమతిపై కొంతవరకు టీడీపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్రకి అనుమతి ఇస్తూ పోలీసు శాఖ ఆదేశాలు ఇచ్చింది. కానీ కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది పోలీస్ శాఖ. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు సూచించారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టబోయే యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా ఎస్పీ రిషాంత్‌ స్పష్టం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్‌, టీడీపీ క్యాడర్‌కు సూచించారు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement