Wednesday, October 4, 2023

దేశంలోనే తొలిసారిగా ఏపీలో శాశ్వత బీసీ కమిషన్.. సీఎం జగన్

దేశంలోనే తొలిసారిగా ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం జగన్ మాట్లాడుతూ… నా మనసంతా పేదలే.. నా ఆచరణ బీసీలేనని అన్నారు. రాష్ట్ర కేబినెట్ లో 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉన్నారన్నారు. 2014-19 వరకు చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదన్నారు. తాము 8మందిలో నలుగురిని బీసీలను రాజ్యసభకు పంపామన్నారు. మండలికి 32మంది ఎమ్మెల్సీలను పంపితే 18మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement