Friday, April 19, 2024

విద్యా సంస్థల మధ్య.. మద్యం దుకాణామా..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విద్యా సంస్థల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దడపడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని బాధితులంతా కలసి జనసేన సమన్వయ కర్త దాసరి రాజును ఆశ్రయించారు. దీంతో స్పందించిన రాజు.. ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులను నిలదీశారు.  

ప్రతిపాదించిన దుకాణం దగ్గరలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. ఈ వైన్ షాప్ మార్గంలోనే అందరు విద్యార్థులు ఉదయం 8 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు ఇంటికి, పాఠశాల, కాలేజి వెళ్తారని చెప్పారు. విద్యార్థులకు మద్యం సేవించే వారితో సమస్య వస్తాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు పలు గ్రామాల నుంచి ఇచ్చాపురం మార్కెట్ కు వచ్చి స్త్రీలకు త్రాగుబోతులతో ఇబ్బంది కలుగుతుందన్నారు. మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement