Wednesday, January 19, 2022

సాగర్ కాలువలో మొసళ్ళు సంచారం

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామ సమీపంలోని సాగర్ కాల్వలో మొసలి సంచరిస్తుండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రోజూ గేదెలను శుభ్రపర్చడానికి సాగర్ కాల్వకు తీసుకెళ్తున్న సమయంలో మొసలి దాడి చేస్తే తమ పరిస్థితేంటని ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

పోతవరం గ్రామ సమీపంలోని సాగర్ కాల్వలో గత కొంత కాలంగా  మొసలి సంచరిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. తమ ఫోన్లో మొసలి సంచారాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News