Friday, December 6, 2024

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన పయ్యావుల కేశవ్

నందికొట్కూరు : ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎస్ రామ సుందర రెడ్డితో కలిసి పరిశీలించారు.

అనంతరం ప్రజా పద్దుల చైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులను, నీటి వనరులను, రిజర్వాయర్ల పరిశీలన నిమిత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు రావడం జరిగిందన్నారు. రెండో రోజు పగిడ్యాల మండలం ముచ్చుమర్రి, నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకాలను పరిశీలించామన్నారు. ప్రాజెక్టు ఈఈ రెడ్డి శేఖర్ రెడ్డిని, సీఈ మురళి నాథ్ రెడ్డి, నీటి సామర్థ్యం ఎంత, రిజర్వాయర్ నుండి ఏయే కాలువలకు ఎంత నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, రిజర్వాయర్ అవుట్ ఫ్లో, నీటిని నిల్వ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల క్రింద ఉన్న ఆయకట్టు, సంవత్సరంలో ఏయే పంటలు పండిస్తారని వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణ బ్యాక్ వాటర్ నిలువ వుండే ప్రాజెక్టు వివరాలు తెలిపే ఫోటో ఫ్లెక్సీ ద్వారా రిజర్వాయర్ వివరాలను స్పిల్ వే, హెడ్ రేగ్యులేటర్ తదితర వివరాలను కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఈ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి వివరించారు. అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ వనిత రాణి, అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ రామారావు, అసెంబ్లీ రిపోర్టర్లు కత్రి శ్రీనివాసులు, మధు సూధన్ రావు లు, ఆర్ డి ఈ ఓ హరి ప్రసాద్, డీఈ సుబ్బారాయుడు, ఏఈలు హరికృష్ణ, శశి కుమారి, స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement