Sunday, January 12, 2025

AP | పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దు

కర్నూలు బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతిలోని బైరాగి క్యూ కాంప్లెక్స్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ క్రమంలో ఆయన కర్నూలు జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఇవాళ‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో పర్యటించాల్సి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును ఆయన సందర్శించాల్సి ఉంది. అయితే పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు ఈ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తార‌నేది అధికారులు త్వరలో ప్రకటించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement