Sunday, October 13, 2024

AP: నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌..

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమలకు చేరుకోనున్నారు. ఈరోజు రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు నడకమార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్‌ పార్టీలతో భద్రతన ఏర్పాటు చేస్తున్నారు.

పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు జనసేన నేతలు.. ఇక, తిరుమల పర్యటన నిమిత్తం.. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్‌ కల్యాణ్‌.. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement