Tuesday, October 8, 2024

AP: ఒక‌టో తేదీనే తిరుమ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్..

ప‌ర్య‌ట‌న‌లో స్వ‌ల్ప మార్పులు
అలిపిరి నుంచి కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు
అక్టోబ‌ర్ రెండున ప్రాయ‌శ్చిత దీక్ష విర‌మ‌ణ‌
మూడో తేదిన శ్రీవారి ద‌ర్శ‌నం
అదే రోజు తిరుప‌తిలో వారాహి స‌భ

అమ‌రావ‌తి – ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీకి బదులు ఒకటో తేదీన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఒకటో తేదీన అలిపిరి నుంచి కాలిబాటలో కొండపైకి వెళతారు. ఇక అక్టోబర్‌ 2వ తేదీ తిరుమల అన్న ప్రసాద వితరణను పరిశీలిన, ప్రాయశ్చిత దీక్ష విరమణ ఉంటుంది. 3న శ్రీవారి దర్శనం, తిరుపతిలో వారాహి సభ ఉంటుంది.

ఇక దీనిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అక్టోబర్ 1 వ తేది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలని అక్టోబర్ 2వ తేది నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement