Thursday, September 16, 2021

ఏపీలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో ఉన్న రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్ల దుస్థితి ఉందని అన్నారు. రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారుల వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలో మీటర్లకుపైగా రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ రోడ్లు దెబ్బతిన్నా ప్రభుత్వం బాగు చేయడం లేదని విమర్శించారు.

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రబుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గంత.. గజానికో గొయ్యిలా ఉందన్నారు. నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చేశానని పవన్ చెప్పారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజవకర్గం తిప్పవరపుపాడు గ్రామనాకి వెళ్లే దారిలో దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు చిధ్రమైందన్నారు. నిలువెత్తు గోతులతో ఉందన్నారు. వెళ్లేదారిలో గుంతలో పడి ఓ ట్రాక్టర్ తిరగబడిపోయిందని చెప్పారు. ట్రాక్టరే కాదు గర్భిణి స్త్రీ వేళ్లే ఆటో కూడా తిరగడిపోయిందని వివరించారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా ఏమీ బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో పోస్టు చేయాలని…వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే..అక్టోబర్‌ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామంటూ పవన్‌ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. జస్టిస్ పీఎస్ నరసింహ!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News