Thursday, April 25, 2024

పవన్ ‘తిరుపతి’ని గెలుస్తాడా?

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపింది. ఇటు బీజేపీ తమ అభ్యర్థి గా రత్నప్రభను బరిలో దింపింది. ఏ ఉప ఎన్నికలలో అయినా అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలకు కొండంత బలం కావాలి. అందుకోసమే బిజెపి తమ తన అస్త్రాన్ని ఎంచుకోంది. ఆ అస్త్రం పేరే పవన్ కళ్యాణ్.

తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ప్రజాదరణ రావాలంటే జనసేనాని పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు అవసరమని బీజేపీ అధిష్టానం గ్రహించింది. కాపుల ఓట్లు అధికంగా వున్న తిరుపతి లాంటి ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ చొరవ లేకుండా వారి ఓట్లను సాధించలేమని కమల నాథులు గుర్తించారు. అందుకే ఆయన్ని మచ్చిక చేసుకునేందుకు ఏకంగా సీఎం క్యాండిడేట్ అని పవన్ అని ప్రకటన చేశారు బీజేపీ నేతలు. మరోవైపు తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రత్నప్రభ నేరుగా హైదరాబాద్ వెళ్లి పవన్ కల్యాణ్ మద్దతు కోరారు.

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్రెండ్ అవుతోంది. వకీల్ సాబ్ సినిమా మానియా ఇప్పుడే ఇంత ఉంటే ఒకవేళ సినిమా విడుదలై భారీ హిట్ అయితే.. ఆ బజ్ తిరుపతి ఎన్నికల్లో పనిచేస్తుందని జనసేన బిజెపి నాయకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమా కూడా సామాజిక అంశాలతో కూడుకున్నది కావడం దీనికి బలం చేకూర్చుతోంది. సినిమా కథ విషయానికొస్తే ముగ్గురు యువతులపై అక్రమంగా పెట్టిన కేసును పవన్ కళ్యాణ్ వాదిస్తారు. అయితే ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో పలుమార్లు మహిళల సమస్యలపై మాట్లాడారు. ఇప్పుడు సినిమా కూడా అదే అంశం చుట్టూ తిరగడంతో పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ఎన్నికల్లో మంచి బూస్టింగ్ అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలో కోట్లల్లో వ్యూస్ లభించాయి. లక్షల్లో కామెంట్స్ పడ్డాయి. వేల సంఖ్యలో డౌన్‌లోడ్స్ రికార్డ్ అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన బాహుబలి-ది కన్‌క్లూజన్‌ ట్రైలర్ కంటే.. దీనికి లభించిన వ్యూస్ అధికం. వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ అనే ఒక్క పేరు చిత్ర పరిశ్రమను షేక్ చేసి పారేసింది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 20 రోజుల ముందు విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్.. పవన్ కల్యాణ్ స్టామినా ఏమిటో మరోసారి ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పింది. వకీల్ సాబ్ ట్రైలర్‌ను చూడటానికి పవన్ కల్యాణ్ అభిమానులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. దీనికి నిదర్శనమే విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఉదంతం. థియేటర్ అద్దాలు పగలి మీద పడినప్పటికీ.. అభిమానులు లెక్క చేయలేదు. రక్తమోడుతోన్నశరీరాలతోనే వకీల్ సాబ్ ట్రైలర్‌ను తిలకించారు. గాయాలు మిగిల్చిన బాధను మరిచిపోయారు. అది- టాలీవుడ్ హీరోగా పవన్ కల్యాణ్‌కు ఉన్న సత్తా.

- Advertisement -

ఒకవేళ వకీల్ సాబ్ మూవీ భారీ హిట్ను సొంతం చేసుకుంటే అది కచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపికి కి కలిసి వస్తుందనేది రాజకీయ నిపుణుల మాట. అయితే ఇందులో మరో కిటుకు కూడా ఉందండి ఎందుకంటే హీరోగా పవన్ కళ్యాణ్ కి ఎనలేని క్రేజ్ ఉన్నప్పటికీ తన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. వైసీపీ, టీడీపీ వంటి బలమైన పార్టీలను ఢీ కొడుతూ.. కోట్ల సంఖ్యలో ఉన్న తన అభిమానులను నమ్ముకుని పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా అందుకున్న సంచలన విజయాలను ఆయన రాజకీయాల్లో దొరకబుచ్చుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో ఓడిపోవడం.. దీనికి అద్దం పడుతోంది.

ఈ పరిణామాల మధ్య తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించునున్న ఉప ఎన్నిక.. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సత్తాకు మరోసారి అగ్నిపరీక్షను పెట్టనున్నాయి. వకీల్ సాబ్‌కు లభించిన వ్యూస్, కామెంట్స్ స్థాయి ఓట్లయినా పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రత్నప్రభకు పడతాయా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement