Sunday, December 10, 2023

చంద్ర‌బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ పాద‌యాత్ర‌…

ప‌ల‌మ‌నేరు – చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా , వెంటనే ఆయన్ను విడుదల చేయాలని కోరుతూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. గంగవరం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ (ఎన్టీఆర్ సర్కిల్) నుంచి కీలపట్లలోని కోనేటి రాయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ వద్ద వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -
   

అనంతరం కోనేటి రాయ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానంతరం మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ టెంకాయలను కొట్టి స్వామివారిని వేడుకున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి . తదనంతరం ఆలయం ఎదుట గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, పలమనేరు పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజులు వైకాపా ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలోపలమనేరు పట్టణ, గంగవరం మరియు పలమనేరు రూరల్ మండలం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement