Thursday, December 5, 2024

మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలి.. సీఎం జగన్

మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేశారు. 213మంది విద్యార్థులకు తొలి విడతగా రూ.19.95కోట్లు విడుదల చేశారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… విదేశీ వర్శిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఉన్నాయన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనన్నారు. ప్రపంచ వేదికపై మన విద్యార్థులు ఆంధ్రా జెండా ఎగురవేయాలన్నారు. పేదల చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు సాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement