Wednesday, March 27, 2024

ఏపీలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. దూసుకొస్తున్న మరో తుపాన్..

శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవ్వాల‌, రేపు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్ద‌ని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నదులు, వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎక్కడిక్కడ జలాశయాలు తొణికిసలాడుతున్నాయి.

తాజా వర్షాలతో మళ్లీ వరదలు సంభవించే ప్ర‌మాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు, దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు (నవంబరు 29) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement