Tuesday, April 16, 2024

ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది… విష్ణుకుమార్ రాజు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాకుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీలు ఒక్కటే అన్న అభిప్రాయం చాలా మంది ప్రజలు నమ్ముతున్నారన్నారు. వైసీపీ, బీజేపీల మధ్య సంబంధం లేదని తాము చెప్పినప్పటికీ ఎందుకో ప్రజలు విశ్వసించడం లేదన్నారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.

వైసీపీతో బీజేపీ ఉందనే అభిప్రాయం కొనసాగితే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని కోరారు. బీజేపీ సాధించిన ఫలితాలపై తాము అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు డబ్బులు పంచలేదని.. వైసీపీ వాళ్లు మాత్రం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా ఓట్లు పడలేదని, ప్రజల్లో చైతన్యం రావడం సంతోషమన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పోరాట స్పూర్తిని ప్రదర్శించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement