Sunday, November 10, 2024

TTD | తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి : సీఎం చంద్రబాబు

పవిత్ర తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే మారుమోగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన సందర్భంగా దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై భగవంతుని అనుగ్రహం నిత్యం ఉండాలని ప్రార్థించాలన్నారు.

భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లు చేస్తోందన్నారు. భక్తులకు అన్నప్రసాదం, పారిశుధ్యం తదితర అనేక సౌకర్యాలు కల్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సౌకర్యాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఏడు తలల స్వర్ణశేషవాహనం (పెద్ద శేషవాహనం)పై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఈ వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement